మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ : మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందిన సుధాకర్‌కు నివాళులు అర్పించేందుకు వస్తున్నారనే సమాచారంతో ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో.. భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పొలాస సుధాకర్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో సుధాకర్భౌ తికకాయానికి నివాళులర్పిం చేందుకు బయలుదేరిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సోమవారం భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుధాకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ప్రథమ చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో ఆయన చనిపోయారు. పోలీసుల వేధింపుల వల్లే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ ఘటనలో పోలీసుల తప్పిదమేనని నిజామాబాద్ సీపీ స్పష్టం చేశారు. సంఘటనపై స్పందించిన మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. సంబంధిత ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


