ఈర్ల రాజు ముదిరాజ్ నివాసంలో బీజేపీ ముఖ్య నేతల భేటీ

ఈర్ల రాజు ముదిరాజ్ నివాసంలో బీజేపీ ముఖ్య నేతల భేటీ

పార్టీ బలోపేతం, సేవా కార్యక్రమాలపై విస్తృత చర్చ.. రాజరాజేశ్వరి కాలనీ నుంచి భారీగా చేరికలు

అమీన్‌పూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ స్వగృహంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మీనా గౌడ్ తదితర బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమీన్‌పూర్ మండలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, రాబోయే పార్టీ కార్యక్రమాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ అమీన్‌పూర్ మండలంలో బీజేపీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు. గ్రామాలు, కాలనీల స్థాయిలో సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం, కష్టపడే కార్యకర్తలతోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సమష్టి కృషితో అమీన్‌పూర్ మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని ఆత్మీయంగా స్వాగతించి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. రాజరాజేశ్వరి కాలనీ నుంచి భారీగా చేరికలు ఈ సందర్భంగా పటేల్‌గూడ శ్రీ రాజరాజేశ్వరి కాలనీకి చెందిన పలువురు ప్రజలు గోదావరి అంజిరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీలో చేరడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ రాజరాజేశ్వరి కాలనీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల విశ్వాసమే తమ బలమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమం, సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతోందని, మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అమీన్‌పూర్ మండలంలో ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చేపడతామని పేర్కొన్నారు. ఈర్ల రాజు దంపతుల ఆత్మీయ సత్కారం  తమ స్వగృహానికి విచ్చేసిన గోదావరి అంజిరెడ్డి, మీనా గౌడ్ తదితరులను ఈర్ల రాజు ముదిరాజ్ దంపతులు నూతన వస్త్రాలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఆత్మీయంగా గౌరవించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కొండా లక్ష్మణ్ గుప్తా, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మీనా గౌడ్, మహిళా నాయకురాళ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజరాజేశ్వరి కాలనీకి చెందిన పలువురు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-10-06 at 2.07.41 PM

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News