ప్రజావాణిలో బాల్కొండ డబల్ బెడ్ రూముల పై ఫిర్యాదు 

ప్రజావాణిలో బాల్కొండ డబల్ బెడ్ రూముల పై ఫిర్యాదు 

బాల్కొండ (నిజామాబాదు జిల్లా):  నిజామాబాద్ జిల్లా బాల్కొండలో డబుల్ బెడ్ రూముల పంపిణి లో అవకత వకలు జరిగాయని " సబ్ కలెక్టర్ స్థాయి అధికారితో " బహిరంగ విచారణ జరిపితే నిజ నిజాలు బయటకు వస్తాయని కోరుతూ బాల్కొండ కు చెందిన అసలైన నిరుపేదలు (15) మంది సోమవారం రోజు ప్రజా వాణి లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు  వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బాల్కొండలో ప్రజా పాలన / గ్రామ సభలో "డబల్ బెడ్రూము" ల కోసం ధరఖాస్తూ చేసుకున్న వారి వద్దకు గ్రామ పంచాయతీ కార్యదర్శి / రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే సమయంలో వారికి అనుకూలంగా ఉన్న ప్రైవేట్ వ్యక్తుల్ని నియమించుకొని  "డబల్ బెడ్‌రూమ్ " దర ఖాస్తూదారుల నుండి డబ్బులు  ఇచ్చుకున్న వాళ్ళకే "ఆన్‌లైన్ నంబర్లు ఇచ్చినట్లు"అలాగే  డబ్బులు ఇవ్వని వారి పేర్లు 2వ విడత డబుల్ బెడ్‌రూమ్ జాభితాలో లేనందున వేల మంది ఆన్లైన్ నెంబర్లు లేని బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రజా పాలన రిజిస్టర్ / దరఖాస్తూల్లో ఆన్లైన్ నుంబర్స్ మాయం 

ప్రభుత్వ యంత్రాంగం / గ్రామ పంచాయతీల ద్వారా నిర్వహించబడిన "డబుల్ బెడ్‌రూమ్ " ఇళ్ల దరఖాస్తుల రిజిస్టర్లు కనిపించకపోవడమే కాకుండా, వేలాది మంది దరఖాస్తుదారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని వారు దరఖాస్తులో వివరించారు.మండల అభివృద్ధి అధికారి (MDO) రెవెన్యూ అధికారికి సమర్పించిన ఆన్‌లైన్ నంబర్లు కలిగిన జాబితా తో పాటు "లబ్ధి దారుల" జాబితాలో, వరుస సంఖ్యలు (01) నుండి (54) వరకు ఇంటి నంబర్లు ఉండగా క్రమ సంఖ్య (55) నుండి (99) జాబితాలో ఇంటి నంబర్లు ఎందుకు చూపించలేదని ? పైగా  బాల్కొండ మండల అభివృద్ధి రెవెన్యూ తహసీల్ధర్ గారికి సమర్పించిన "అనర్హుల రిజిస్టర్"జాబితాలో, వరుస సంఖ్యలు 1 నుండి 407 వరకు ఆన్‌లైన్ నంబర్లు లేకుండా కేవలం ఇంటి నంబర్లు మాత్రమే ఉన్నాయని,408 నుండి 987 వరకు ఆన్‌లైన్ నంబర్లు ఇచ్చి, ఇంటి నంబర్లు చూపించక పోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని వారు దరఖాస్తులో వివరించారు.  బాల్కొండలో మొదటి మరియు 2వ విడత డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఒకే ఇంటికి 2 నుండి 3 డబుల్ బెడ్‌రూమ్ పొందినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.బాల్కొండలోని మొదటి మరియు రెండవ దశ లబ్ధిదారుల జాబితాలోని వారి కులం, ఇంటి నంబర్, ఆధార్ నంబర్ మరియు ఆన్‌లైన్ నమోదు వివరాలపై విచారణ చెస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.ఇది ఇలా ఉండగా డబల్ బెడ్ రూముల  గంధర గోలానికి ముఖ్య సూత్ర దారి మాజీ గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు మండల పరిషత్ అధికారి ఇద్దరూ కలిసి ప్రజా పాలన / గ్రామ సభల్లో దరఖా స్తూ చేసుకున్న వారందరికి  ఆన్‌లైన్ నంబర్లు కేటా యించకుండా, కేవలం డబ్బులు సమర్పించిన వారికి మాత్రమే ఆన్‌లైన్ నంబర్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని వారు ఆరోపిస్తూ తప్పుల తడక జాభితాను వారు కలెక్టర్ కు అందజేశారు.

2వ విడుత పంపిణి లో అవినీతి 

సెప్టెంబర్ 30 వ తేదీ సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:00 గ్రామ పంచాయతి లో 'రెండవ విడత' డబుల్ బెడ్‌రూమ్ జాబితాను గ్రామ పంచాయతి లో సర్పంచ్ తో కలసి కొందరు నాయకులచే   లబ్ది దారుల జాబితను తైయ్యారు చేసి రెవెన్యూ తహసీల్దర్ కు రాత్రి 9:34 లకు అందజేయగ," లక్కీ డ్రా నిర్వహన కంటే ముందే "  లబ్ది దారులు మరియు వారి పేర్లను సిఫార్సు చేసిన బ్రోకర్లు అదే రోజు (సెప్టెంబర్ 30 న) రాత్రి 9:45 నిమిషాలకు"లక్కీ డ్రా" వేదికకు చేరుకొవడం విశేషంగా ఉందని, రాత్రి 10:08 గంటలకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని లక్కీ డ్రా తీస్తూ పేర్లు పిలిచే  సమ యంలో వేదిక ముందు ఉన్నవారు తమ చేతులు పైకెత్తి తామే లబ్ధిదారులమని చెప్పడం గమనార్హం.ఈ లబ్ధి దారులలో కొందరు బాల్కొండ కు 3 నెలల క్రితమే ఆర్మూర్ నుండి వచ్చిన వారు,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేవారు, వ్యవసాయ భూములు, స్వంత ఇల్లు,ఆర్థికంగా బల పడిన వారు,మరో ఇద్దరు జర్నలిస్టుల రక్త సంబందీకులకు,ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వైద్యుల రక్త సంబందీకులకు, మరియు రాజకీయ నాయకుల రక్తసంబంధీకులు ఉన్నారని  బాధితులు ఆరోపిస్తున్నారు. తేదీ 30-09-2026 రాత్రి "లక్కీడ్రా" ఎంపికైన అభ్యర్థుల జాభితాను రద్దు చేసి,  "లక్కీడ్రా" ఎంపికైన అభ్యర్థులను మరియి ప్రజా పాలనలో / గ్రామ సభలో డబుల్ బెడ్‌ రూమ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరినీ గ్రామంలో "చాటింపు ద్వారా" పిలిపించి, బాల్కొండలోని పాఠశాల మైదానంలో "సబ్-కలెక్టర్ స్థాయి అధికారి" సమక్షంలో వారిని హాజరు పరచండి (పరేడ్ చేయించండి) దీంతో నిజ నిజాలు బయటికి వస్తాయి వారు కలెక్టర్ కు విజ్ఞప్తి చేసారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ