కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం

కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం

హుస్నాబాద్‌లో ఘనంగా "కాకా" 97వ జయంతి వేడుకలు

హుస్నాబాద్‌  : పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మాజీ కేంద్రమంత్రి, సి డబ్ల్యూ సి సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు దివంగత "కాకా" వెంకటస్వామి సేవలను కాంగ్రెస్‌ నాయకులు స్మరించుకున్నారు. ఆయన 97వ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌లో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి, "కాకా" చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. పెద్దపల్లి ఎంపీగా పలుమార్లు గెలిచిన ఆయన కేంద్రంలో జౌళి, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారని తెలిపారు. చేనేత, బీడీ కార్మికుల సంక్షేమంతోపాటు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధిలోనూ ఆయన పాత్ర మరువలేనిదని అన్నారు.మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ హుస్నాబాద్‌లో వీవర్స్‌ కాలనీ, బీడీ కార్మికుల కాలనీ ఏర్పాటుకు కాకా వెంకటస్వామి కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని, భావితరాలకు ఆయన సేవలు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను చేర్చాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి కాకా వెంకటస్వామి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన అడుగుజాడల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రజాసేవ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు కేశవేణి రమేష్‌, గోపగోని శోభన్‌ గౌడ్‌, వైద్యం కిరణ్ ప్రసాద్, బొలిశెట్టి రాజు, పిల్లి తిరుపతి, బూరుగు లత, కోఆప్షన్‌ సభ్యురాలు భూక్య సరోజన, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, పట్టణ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు బూరుగు కృష్ణ స్వామి, గురాల సంజీవరెడ్డి, చెన్నవేని విద్యాసాగర్, సావుల రాజయ్య,పూదరి శ్రీనివాస్, గట్టు రాములు, కోడం ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ