ప్రజల ముంగిటకే ప్రజాప్రతినిధులు,అధికారులు.

ప్రజల ముంగిటకే ప్రజాప్రతినిధులు,అధికారులు.

  • పట్టణాన్ని స్వచ్చ తాండూరు చేయడమే లక్ష్యం.
  • "స్వచ్ఛ తాండూర్ స్పెషల్ డ్రైవ్"కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
  • అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి
  • స్వచ్ఛ తాండూర్ అభివృద్ధికి కృషి చేయాలి.. ఎమ్మెల్యే

తాండూరు : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల ముంగిటకే ప్రజా ప్రతినిధులు అధికారులు వార్డులో పర్యటించారు. స్వచ్ఛ తాండూర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని 26, 27, 33, 34, 35, 36 వార్డుల్లో నిర్వహించిన “స్వచ్ తాండూరు స్పెషల్ డ్రైవ్” కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నీరాజ బాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయా వార్డుల్లో పర్యటించి మురుగు కాలువల శుభ్రత, చెత్త సేకరణ, రోడ్లు, వీధుల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు తదితర అంశాలను దగ్గరుండి పరిశీలించారు. స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనులను వేగవంతంగా చేపట్టాలని, మురుగు కాలువల శుభ్రతతో పాటు రోడ్లు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా వార్డుల్లో డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే, అవసరమైన ప్రాంతాల్లో నూతన డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.అలాగే స్థానిక ప్రజలను నేరుగా కలిసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. దోమల నివారణకు నిరంతరం ఫాగింగ్ నిర్వహించాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా వార్డుల్లోని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించి, అక్కడి పరిస్థితులను, పిల్లలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. “స్వచ్ తాండూరు స్పెషల్ డ్రైవ్”లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులు కేవలం ప్రత్యేక కార్యక్రమాలకే పరిమితం కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.పట్టణ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు స్వచ్ఛమైన తాండూరు నిర్మాణంలో మున్సిపాలిటీకి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కమిషనర్ రాకేష్, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-10-06 at 3.02.23 PM (1)

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News