లట్టుపల్లి గ్రామంలో  కరెంట్ కోత..

లట్టుపల్లి గ్రామంలో  కరెంట్ కోత..

నాగర్ కర్నూల్  మండలం బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో నేటి ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఉదయం నుంచి కరెంట్ లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి మోటార్లు నడవక తాగునీటికి ఇబ్బంది, ఇళ్లలో చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. రైతుల పనులకు, విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది.సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Views: 100

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News