ఆదిలాబాద్ లో ఓటు చోరీపై ఇండియా కూటమి ధర్నా

ఆదిలాబాద్ లో ఓటు చోరీపై ఇండియా కూటమి ధర్నా

ఆదిలాబాద్  : ఓటు చోరీకి పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, ఓట్లను దొంగిలించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ ఏఐసీసీ సెక్రటరీ గండ్రత్ సుజాత, సీపీఎం నాయకులు దర్శనాల మల్లేష్, దత్తాత్రేయ, సీపీఐ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సిరా దేవేందర్, దాజీ విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ, బీజేపీ ఓటు చోరీకి పాల్పడి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని, దీనిని ఇండియా కూటమి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కును కాపాడుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News