అంగన్వాడి సెంటర్లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం.
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లింగన్నపేట సెక్టార్ పరిధిలోని ముచర్ల అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం లో భాగంగా మంగళ వారం ప్రోగ్రామ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లోప పోషణ గల పిల్లల బరువు,ఎత్తు మళ్ళీ చూడటం జరిగింది.వారి తల్లి దండ్రులకు కరీంనగర్ లో ఎన్ఆర్సి కి ఆర్ బి ఎస్ కే వాహనం ద్వారా పంపిస్తామని, వారు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. మరియు 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయడం, గర్భవతులకు శ్రీమంతాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్క ప్రశాంత్, ,స్పెషల్ ఆఫీసర్ హనుమంతనాయక్ , ఎంపీడీవో రాజేందర్ , ఎంపీఓ శ్రీనివాస్ , ఐసిడిఎస్ ఏసి డిపిఓ ఉమారాణి , సిహెచ్ఓ రాజేందర్ సూపర్వైజర్ స్వరూప, వార్డు మెంబెర్స్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి టీచర్స్ అనిత, లక్ష్మి,సుకన్య,ఆశాలు, గర్భవతులు, బాలింతలు, కిషోరబాలికలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


