ఎండుతున్న పంటలు.... ఆందోళన లో రైతన్నలు.

ఎండుతున్న పంటలు.... ఆందోళన లో రైతన్నలు.

  •  నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేయాలని రైతుల విజ్ఞప్తి..
  •  సరైన వర్షాలు లేక ఎత్తేస్తున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

కామారెడ్డి ,బాన్సువాడ : వర్షాకాలంలో రైతులు వేసిన వరి మొక్కజొన్న సోయాబీన్ పంటలు నీరు అందగా ఎండిపోతున్నాయి. బాన్సువాడ నియోజకవర్గం లోని మన్మాజీపేట్, సిద్దాపూర్, చింతల్ పేట్, పైడిమల్, గుంటూరు క్యాంప్, కోల్దాస్  తండా, చేలకతాండ,  గ్రామ పరిసరాల్లో చివరి దశలో నీరు అందక వేసిన పంటలు ఎండ లో ఆహుతి అవుతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అంది వచ్చిన పంట భూగర్భ జలాలు అడుగట్టడం తో వేసిన పంటలు 500  ఎకరాలు ఎండి పోయాయి. రైతు ముఖంలో కన్నీళ్ళ కనిపిస్తూ ఆరుగాలం శమించి పండించిన పంట రెండు తడులు  నీటిని పారిస్తే పంట చేతికి వచ్చేదని రైతన్నలు వాపోతున్నారు. వర్షాకాలం లో వర్షాలు సరి అయిన సమయం లో కురువకపోవడం తో దినదినం భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ప్రస్తుతం 60  ఎకరాల వరకు రైతులు పంటలను దున్ని వేయడం జరిగింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు ఎండి పోవడం తో వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం కోరుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు పేర్కొంటున్నారు.

WhatsApp Image 2026-10-06 at 1.27.17 PM

 మూడు ఎకరాల పంట ఎండిపోయింది.....

బలగానోల్ల ప్రకాష్ గౌడ్ రైతు  హనుమాజీపేట్.....

వర్షాలు సక్రమం గా పడకపోవడం తో వేసి వరి పంట ఎండిపోయింది. పంట పెట్టుబడి పోయి తీవ్ర ఆర్థిక నష్టం ఏర్పడింది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు ప్రకాష్ గౌడ్ కోరారు.

Views: 194

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News