బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసాలు.. నిందితుడి అరెస్ట్
- ఆదిలాబాద్ బాధితుని వద్ద రూ.73,279 మోసం
- మహారాష్ట్ర గోవా తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 150 ఫిర్యాదులు నమోదు.
- మూడు రాష్ట్రాల బాధితుల వద్ద 95 లక్షల వరకు మోసం
ఆదిలాబాద్ : మహారాష్ట్రలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు నిందితుడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నిందితుడి వివరాలు చైతన్య ప్రమోద్ కుటె (25), S/o ప్రమోద్ కుటె, డబ్కి రోడ్డు, గురుకృప ప్రొవిజన్ సమీపంలో, మెహరేనగర్, భూరడ్ పోస్ట్, అకోలా గ్రామీణ, అకోలా జిల్లా, మహారాష్ట్ర. (ప్రస్తుతం పింప్రి-చించ్వాడ్, పూణే, మహారాష్ట్ర. బ్యాంక్ అధికారులమంటూ ప్రజలకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు మరియు ఓటీపి లు సేకరించి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ బ్రాహ్మణవాడకు చెందిన బాధితుడు ప్రఫుల్ పాటిల్కు 2026 జూలై నెలలో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, అతని క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేస్తామని నమ్మించి సైబర్ మోసానికి పాల్పడి రూ.73,279/- కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబరు 633/2026 నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎన్ సి అర్ పి పోర్టల్ ద్వారా లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పై అధికారుల ఆదేశాల మేరకు ఆదిలాబాద్ 1 టౌన్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం మహారాష్ట్రకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్‌కు తీసుకువచ్చింది. పోలీసుల విచారణలో నిందితుడు తాను గతంలో ఎక్స్ప్రెస్ బ్యాంక్‌లో పనిచేసిన సమయంలో కస్టమర్లతో మాట్లాడిన అనుభవాన్ని ఉపయోగించుకుని, బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన మొబైల్ నంబర్లను సేకరించినట్లు తెలిపాడు. అనంతరం వివిధ సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ బ్యాంక్ అధికారులమంటూ కస్టమర్లకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఓ టీ పి లను తెలుసుకుని డబ్బులను వివిధ యు పి ఐ అమెజాన్ ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు తెలిపాడు. నిందితడు తెలంగాణ, మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలలో దాదాపు 150 మంది బాధితుల వద్ద రూ 95,33,651/- నగదు నష్టపోయినట్లు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నందు ఫిర్యాదులను నమోదు అయినట్లు తెలిపారు. అదేవిధంగా 23.07.2026న బాధితుడికి హెచ్డీ ఫ్ సిబ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నమ్మించి, ఓ టీ పి లను తెలుసుకుని ఐదు లావాదేవీల ద్వారా మొత్తం రూ.73,279/- బదిలీ చేసుకున్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు మోసాలకు ఉపయోగించినట్లు తెలిపిన మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడించాడు. అలాగే వివిధ మొబైల్ నంబర్లతో సిమ్ కార్డులు మార్చుతూ, మొబైల్ ఫోన్లు మార్చుతూ సైబర్ మోసాలకు పాల్పడినట్లు తెలిపాడు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నవి
- ఒక కారు ,- ఐ ఫోన్ చెయండి 13 మొబైల్ ఫోన్
- వివిధ సిమ్ కార్డులు
నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులు లేదా ఇతర సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ టీ పి, పిన్, సి వి వి, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. కేసు నందు కీలకంగా వ్యవహరించిన సిబ్బంది ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా నగదు రివార్డులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం నందు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐ లు గోపికృష్ణ, అశోక్, మరియు పోలీసు సిబ్బంది, సైబర్ క్రైమ్ కీలకంగా వ్యవహరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


