స్కౌట్ మాస్టర్స్, గైడ్ కెప్టెన్లకు సర్టిఫికెట్ల ప్రదానం
మెదక్ : మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి చేతుల మీదుగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బేసిక్ మరియు అడ్వాన్స్‌డ్ శిక్షణ పూర్తి చేసిన స్కౌట్ మాస్టర్స్, గైడ్ కెప్టెన్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన స్కౌట్ మాస్టర్స్, గైడ్ కెప్టెన్లను అధికారులు అభినందించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు, శిక్షకులు, స్కౌట్ మాస్టర్స్, గైడ్ కెప్టెన్లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


