బొల్లారం విద్యారంగంలో విప్లవాత్మక అడుగు..

బొల్లారం విద్యారంగంలో విప్లవాత్మక అడుగు..

  • రూ.21.65 కోట్లతో క్యూర్ అర్బన్ రీజియన్ స్కూల్, ఆదర్శ పాఠశాల అదనపు తరగతి గదులు..
  • త్వరలో అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ విద్యాసంస్థలు..
  • ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆధునిక వసతులతో విద్యాబోధన..
  • పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 
  • ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం ప్రారంభం.

బొల్లారం డివిజన్ పరిధిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు తొలి అడుగు పడిందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రతి పేద, మధ్యతరగతి విద్యార్థికి అన్ని ఆధునిక వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. క్యూర్ అర్బన్ రీజియన్ స్కూల్స్‌లో భాగంగా బొల్లారం డివిజన్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలో రూ.19.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన పాఠశాల భవన నిర్మాణ పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పాఠశాలలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధనతో పాటు విద్యార్థులకు అవసరమైన ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అనంతరం రూ.90 లక్షల క్యూర్ అర్బన్ రీజియన్ స్కూల్స్ నిధులతో ఆదర్శ బాలికల పాఠశాలలో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రూ.1.65 కోట్లతో నిర్మించిన ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ విద్య, ఆధునిక వసతులు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. బొల్లారం ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ విద్యాసంస్థ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని అన్నారు.ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బల్దియా పరిధిలో 365 కోట్ల రూపాయల నిధులతో క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలలు, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని అభిలాషించారు.   ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, TGEWIDC ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డిఈ రాజు, మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News