ఉపాధ్యాయుల సేవలను విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి
- చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ
చేగుంట: చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరిం చుకొని ఉపాధ్యాయులందరికీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ మనం ఏ స్థాయిలో ఉన్న, ఉపాధ్యాయులను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని, తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయులే విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహిస్తారని, విద్యార్థులను చెడు మార్గం నుంచి మంచి మార్గం వైపు నడిపించే వారే ఉపాధ్యాయులని, కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు విని, ఉన్నత స్థాయికి ఎదగాలని వారన్నారు. చేగుంట ఎంఈఓ నీరజ మాట్లాడుతూ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఉపాధ్యాయులను సన్మానించడం గొప్ప విషయం అని, మీరు మా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులందరినీ సన్మానించడం చాలా సంతోషమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు రఘుపతి ,సుధాకర్ రెడ్డి,రాధ, రమా, రమాదేవి,చల్లా లక్ష్మణ్,సరస్వతి,,రావుల వెంకటేష్,శ్రీనివాస్ గౌడ్, శ్రీవాణి,మనోహర్ రావు,శారదా, ఉమా దేవి,ఉమా మహేశ్వరీ, విజయలత, కవిత,హిమవర్ష తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


