18 గ్రామాల గిరిజన ప్రజల మహా సమరం  

18 గ్రామాల గిరిజన ప్రజల మహా సమరం  

నందరాజ్ కొండల్లో గనుల తవ్వకాలపై రగిలిన ఆందోళన

చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని పవిత్ర నందరాజ్ కొండను కాపాడుకునేందుకు దండకారణ్య గిరిజనులు ఏకమయ్యారు, ఆ ప్రాంతంలో తలపెట్టిన ఇనుప ఖనిజ తవ్వకాలను తీవ్రంగా నిరసిస్తూ 18 గ్రామాల ప్రజలు సమిష్టిగా ఉద్యమబాట పట్టారు
  
సమీకరించిన ప్రజలు – పెల్లుబికిన నిరసన

గనుల నిర్వహణ కోసం పర్యావరణాన్ని నాశనం చేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, డిపాజిట్ 13 గా పేర్కొనే ప్రాంతంలో విస్తారంగా ఉన్న అటవీ ప్రాంగణాన్ని తుడిచిపెట్టేందుకు అధికారుల నుంచి ఏర్పాట్లు వేగవంతమవ్వడంతో  గిరిజనులు తమ భూములు మరియు పర్యావరణ రక్షణకై ఐక్యంగా పోరాటానికి సమాయత్తమయ్యారు
 
చెట్ల నరికివేతకు సన్నాహాలు – ఊపందుకున్న ఆందోళన

డిపాజిట్ 13 పరిధిలోని అమూల్యమైన చెట్లను నరికివేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది, ప్రకృతి వనరుల విధ్వంసాన్ని అడ్డుకునేందుకు లక్షలాది మంది ప్రజలు ఒకే వేదికపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు మరియు ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News