MCPI(C)  సిద్దిపేట్ జిల్లా కార్యదర్శి గా ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి 

అక్కన్నపేట : పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయo, అక్టోబరు 5(విజన్ ఆంధ్ర): భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ క్లాస్ స్ట్రగుల్ (MCPI-C) సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా కా. ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డిని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. గతంలో వామపక్ష ఉద్యమంలో పనిచేసిన ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కా. లింగంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కా. ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి గతంలో సీపీఐ(ఎం),  అనుబంధ రైతూ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా క్రియాశీలకంగా పని చేశారుగవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం రావడంతో ఆ ఉద్యోగం లో చేరి డిసెంబర్ 24న రిటైర్ అయ్యారు. నూతనంగా ఏర్పడిన భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ క్లాస్ స్ట్రగుల్ (MCPI-C) ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చడంతో తిరిగి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేయాలని నిర్ణయించుకుని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కా. లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్లు తెలిపారు. గతంలో CPIM,  అనుబంధ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడిగా నాయకుడిగా, పార్టీ కార్యకర్తగా పనిచేసిన అనుభవం, ప్రజా సమస్యలపై ఉన్న అవగాహనను పరిగణనలోకి తీసుకుని ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డికి సిద్దిపేట జిల్లా   కార్యదర్శి బాధ్యతలు అప్పగించినట్లు కా. లింగంపల్లి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్మికులు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేస్తానని ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News