బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అరెస్ట్..
నిజామాబాద్ : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని జీజీహెచ్ మార్చురి వద్ద ఆందోళన చేస్తున్న ఆయనను అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితులకు న్యాయం చేయాల్సిందే..భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యయత్నం చేసిన సుధాకర్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులతో కలిసి మంగళవారం ఉదయం జీజీహెచ్ మార్చురికి వచ్చారు. సుధాకర్ మృతదేహాన్ని పరిశీలంచిన అనంతరం అక్కడే ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


