విద్యార్థులకు విద్యాసామాగ్రి అందజేసిన హెటిరో పరిశ్రమ యాజమాన్యం 

విద్యార్థులకు విద్యాసామాగ్రి అందజేసిన హెటిరో పరిశ్రమ యాజమాన్యం 

 వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న విద్యార్థులు

సంగారెడ్డి ప్రతినిధి పటాన్చెరు: విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలిచేందుకు హెట్రో పరిశ్రమ యాజమాన్యం విద్యా సామాగ్రిని అందజేసింది. పరిశ్రమ సిఎస్ఆర్ నిధుల తో సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాతో ల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, బూట్లు, పాఠశాల బ్యాగులు, తదితర అవసరమైన విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాపరెడ్డి చేతుల మీదుగా ఈ సామాగ్రిని, జిన్నారం, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, సోమవారం రోజున అందజేశారు.ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు, వైస్ చైర్మన్, మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు తోడ్పడటం తమ సంస్థ బాధ్యతగా భావిస్తున్నట్లు, పరిశ్రమ హెచ్ఆర్ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో, నాణ్యమైన విద్య అందుతుందని, అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటారని వారు అన్నారు. విద్యార్థులు ఉపన్యాసాల ద్వారా పరిశ్రమకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మృదుల, బిజెపి సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, పూడూరు సుధాకర్, వీరేశం,విద్యార్థులు, పరిశ్రమ ప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News