చౌటకూర్ నూతన ఎంపీవోగా కే. రాజ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

చౌటకూర్ నూతన ఎంపీవోగా కే. రాజ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

                                                                                                                                                                                                                                  •  

చౌటకూర్: చౌటకూర్ మండల నూతన పంచాయతీ అధికారిగా (ఎంపీవో) శ్రీ కే. రాజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఎంపీవో గుమ్మడిదల మండలానికి బదిలీ కాగా, వారి స్థానంలో ఝరాసంగం మండలంలో పనిచేసిన శ్రీ కే. రాజ్ కుమార్ గారు చౌటకూర్ ఎంపీవోగా బదిలీపై వచ్చి విధులలో చేరారు.ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీవో రాజ్ కుమార్ గారిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీ కే. శంకర్ .మండల పంచాయతీ కార్యదర్శులు శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం నూతన ఎంపీవో శ్రీ కే. రాజ్ కుమార్ మాట్లాడుతూమండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా చేరవేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మండల పాలన మరింత సమర్థవంతంగా సాగేలా ఎంపీడీవోతో కలిసి ముందుకు సాగుతానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు బషీర్, మల్లేశం, వేణుగోపాల్, నర్సింలు, సందీప్, అశోక్, కృష్ణ, రంజిత్, మల్లేష్, సిద్ధమ్మ, పావని, అలేఖ్య, కృష్ణవేణి, షూలామతి, అఖిల, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది శైలజ, వహీద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News