నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

 -మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

 -మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

నాంపల్లి: నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గురువారం నాడు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు, గొల్లభామల వేషధారణలో సందడి చేసి ఆకట్టుకున్నారు. చిన్నారుల వేషధారణ, ఉట్టికొట్టే కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని శ్రీకృష్ణాష్టమి విశిష్టతను ప్రతిబింబించేలా సాంస్కృత కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చండూరు మున్సిపల్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంతోపాటు, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పండుగల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రతి ఒక్కరు భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, చిలుకూరి రామేశ్వరి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 46

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన