కరెంటు కోతలతో కాలం వెళ్లదీస్తున్న దివాలా ప్రభుత్వం 

 తిమ్మాజిపేట మండల కేంద్రంలోని 33kv సబ్ స్టేషన్ ముందు  బీఆర్ఎస్ నాయకుల ధర్నా

కరెంటు కోతలతో కాలం వెళ్లదీస్తున్న దివాలా ప్రభుత్వం 

తిమ్మాజిపేట: రైతులకు విద్యుత్ ఇవ్వలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిస్తుందని బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు విమర్శించారు. గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ  పిలుపుమేరకు కాంగ్రెస్ వెయ్యి రోజుల అసమర్ధ పాలనకు నిరసనగా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని 33kv సబ్ స్టేషన్ ముందు సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ మాట్లాడుతూ... రైతులకు నిరంతరాయంగా గతంలో కేసీఆర్ విద్యుత్ అందించి రైతుకు అండగా నిలిచారని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయంలో విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టి విద్యుత్ ఉంటేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి అన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో అనేక సంస్కరణలను తీసుకువచ్చి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్న ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. ఒక వ్యవస్థను పటిష్టంగా నిర్మించి రాష్ట్రానికి విద్యుత్ వ్యవస్థ అంటేనే తెలంగాణ అనే విధంగా తీర్చిదిద్దిన ఘనత కెసిఆర్ కె సొంతమన్నారు. అలాంటి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు లేరన్నారు. రైతుల వద్దకు వెళితే రైతు భరోసా మద్దతు ధర, బోనస్, యూరియా కొరతపై ఎక్కడ నిలదీస్తారో అని భయపడి తప్పించుకొని తిరుగుతున్నారని వారు విమర్శించారు. చేతకానితనానికి నిలుపుటద్దంగా నిలిచిన కాంగ్రెస్ పాలనపై ప్రజలు రైతులు విసుగు చెందారన్నారు. రైతులను వచించిన ప్రభుత్వాలు ఏవి కూడా మనుగడ సాధించలేదని కాంగ్రెస్ పార్టీకి కూడా భవిష్యత్తులో పుట్టగతులు ఉండబోవని వారు హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా ఇవ్వలేక కాంగ్రెస్ చేతకానితనాన్ని ఎత్తిచూపితే బీఆర్ఎస్ పార్టీపై ఇతర ప్రతిపక్ష పార్టీలపై ప్రతి దాడికి దిగుతున్నారే తప్ప సమస్యల పరిష్కారానికి మార్గాన్ని అన్వేషించడం లేదని వారు విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెబుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-03 at 3.08.47 PM

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన