వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం

వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం

  • రైతులను,ప్రజలను మోసం చేసింది.
  • మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి

ఓదెల : మన మాజీ సీఎం చంద్రశేఖర రావు,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ విధ్వంసం పై ఓదెల మండలంలోని మారుతి ఫంక్షన్ హాల్ లో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి రైతు సదస్సు నిర్వహించి మాట్లాడారు.2014 కు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కూడా ఇదే ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు. ఆ సమయంలో కరెంటు పరిస్థితి,సాగునీటి పరిస్థితి,ఎరువుల బస్తాల పరిస్థితి ఎట్లా ఉందో మనందరికీ తెలుసు.చాలీచాలని కరెంటు,6 గంటల కరెంటు ఇస్తామని చెప్పి 4 గంటలు కూడా కరెంటు రాలేదన్నారు.ఆ రోజుల్లో కరెంట్ పరిస్థితి సరిగా లేక మోటార్లు,స్టార్టర్లు కాలిపోయాయి,తర్వాత ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి.ఎరువుల బస్తాల కొరకు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఉండేది.ఒక పంటకు నీళ్లు వస్తే రెండో పంటకు వచ్చేవి కావు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉండేది. అప్పుడు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. తర్వాత మీ అందరి ఆకాంక్షల మేరకు మన కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కరెంటు విషయంలో ఆరు నెలల లోపలనే మనకు 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.అట్లాగే ఎరువుల బస్తాలు మనకు ఎక్కడబడితే అక్కడ ఫ్రీగా మనకు లభించే పరిస్థితి ఉంది.సొసైటీల ద్వారా,డిసిఎంఎస్ ల ద్వారా,మరి దుకాణాల ద్వారా కావచ్చు.. ఎక్కడికి పోయినా కూడా మనకు ఎవరితో చెప్పకుండా ఎరువుల బస్తాలు వచ్చినాయి.అట్లాగే కరెంటు వచ్చింది, సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది.మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు భరోసా.. రైతు బంధు ఇవ్వడం జరిగింది.ఎకరానికి 10 వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి కొరకు రైతు బంధు తో పాటు రైతు బీమా ఇవ్వడం జరిగింది.మరి ఇవన్నీ కేసీఆర్ ఆలోచన మేరకు రైతును రాజును చేయాలని, రైతు అప్పులపాలు కాకుండా సగర్వంగా తలెత్తుకునే విధంగా ఉండాలని పెట్టుబడి సాయం చేశారు. రైతు బాగుపడతాడనే ఆలోచనతో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ చేశామన్నారు. 2023 ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల హోదాలో, ఆ రోజు పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో మేరకు ఆ రోజు వాగ్దానాలు చేశారు.ఎక్కడా ఊహించనటువంటి ఏది వీలైతే, ఏది గుర్తుకొస్తే దాన్ని ఇది చేస్తాం,అది చేస్తాం అని చెప్పారు. ముఖ్యంగా రైతుల విషయంలో ఆరోజు ఎకరానికి కేసీఆర్ ఇచ్చిన 10 వేలు కాకుండా 15 వేల రూపాయలు ఇస్తామని,కౌలు రైతులకు 12 వేలు,ఇస్తామని భూమి లేని నిరుపేదలకు 12 వేలు ఇస్తామని చెప్పారు.సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ నెరవేరినాయా? ఇవన్నీ వచ్చినాయా? ఇవాళ రైతు భరోసా మూడు పంటల డబ్బులు ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. ఒక రెండు పంటలకు అయితే 3 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు మాత్రమే రైతుబంధు ఇచ్చాను. ఆ రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పి  10 వేలు కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారన్నారు.సన్న వడ్లకు బోనస్ 7 రకాల పంటలకు..7 రకాల వడ్లకే మరి బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ బోనస్ కూడా ఇచ్చే పాపాన పోలేదు.తర్వాత రుణమాఫీ చేస్తామన్నారు. సగం మందికే రుణమాఫీ జరిగిందన్నారు, మిగతా వాళ్లకు రుణమాఫీ జరగలేదన్నారు. అంటే రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదన్నారు.ఆగస్టు 15 తేదీ కి రైతు బీమా ప్రీమియం చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం చెల్లించలేదు.బీమా పథకం ఆగిపోయింది. ఇవాళ ఎవరైనా రైతు చనిపోతే ఆయన బతుకు ఇవాళ.. వాళ్ల కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ విధంగా మరి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులను మోసం చేసి, మనల్ని ఈవిధంగా ఇబ్బంది పెడతా ఉందన్నారు‌. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు.ఎల్ నినో పరిస్థితి వచ్చింది అని చెప్పి మన కేటీఆర్ దాదాపు మే నెల నుంచే కాళేశ్వరం పంపులు ఆన్ చేసి చెరువుల్లోకి నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలని చెప్పారన్నారు.కానీ పెడచెవిన పెట్టిన ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయిందని అని చెప్పి విషప్రచారం చేశారన్నారు. కాళేశ్వరంలో కేవలం ఒక్క రెండు పిల్లర్లు తప్ప ప్రాజెక్టులో ఉన్నటువంటి మూడు బ్యారేజీలు అన్నీ కూడా దివ్యంగా ఉన్నాయని,ఏ ఇబ్బంది లేదని,ఆ బ్యారేజీలలో నీళ్లు నింపడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమే అని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్లు చెప్పారని గుర్తు చేశారు. ఇవన్నీ మనల్ని.. తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లా రైతాంగాన్ని ఈ విధంగా మోసం చేశారని,ఈ మోసంలో ఎమ్మెల్యే కూడా ఉన్నారన్నారు. వడ్ల తూకం విషయంలో ఎక్కువ తూకం వేస్తారని.మొన్న జరిగిన తూకంలో దాదాపు 2 నుంచి 2.5 కిలోలు ప్రతి బస్తాకు అదనంగా తూకం వేశారన్నారు. అప్పుడు ఎమ్మెల్యే మాట్లాడాడు ఇవాళ జరుగుతున్నదని ప్రశ్నించారు.ఇసుకను అమ్ముకున్నారని అమ్ముకున్నారని చెప్పి ఇప్పుడు 100 రెట్లు మట్టి అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క రైతుల విషయంలోనే కాదు, సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.ముఖ్యంగా ఆడబిడ్డలను,మహిళలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని,పెన్షన్.. 2 వేల ను 4 వేలు చేస్తానని,ఆడబిడ్డలకు స్కూటీ కొనిస్తామని చెప్పి ఇప్పటివరకు ఏమి చేయలేదన్నారు.ఆడబిడ్డకు 2,500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు.ఇవన్నీ రైతు డిక్లరేషన్ లో అప్పుడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ  కూడా ఇవన్నీ మేము నెరవేరుస్తాం అని చెప్పి చెప్పలేద అని ప్రశ్నించారు. మరి ఇందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.రైతులకే కాదు, కౌలు రైతులు,ఆటో డ్రైవర్లను కూడా మోసం చేశారన్నారు. విద్యార్థులకు ఫీ రీఇంబర్స్‌మెంట్.. ఫీజు చెల్లించ లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.విద్యా భరోసా కార్డ్ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.విదేశీ విద్య కొరకు 25 లక్షల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఈ 100 రోజుల పాలన మోసాన్ని, దగాను ప్రజలకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లో మెజారిటీ రైతులదే, రైతులు మోసపోయిన విధానాన్ని తెలియజేయాలన్నారు. మీ ద్వారా జరగాలనే ఉద్దేశంతోని కేసీఆర్ రైతు సదస్సు ఆలోచన చేశారన్నారు. కేసీఆర్ సూచనల మేరకు రైతులు పడుతున్న ఇబ్బందులు,రైతులు మోసపోయిన విషయాన్ని మనం పూసగుచ్చినట్టు ప్రతి రైతుకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.ఆ సూచనల ఫలితమే ఈ రైతు సదస్సు ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన రైతు మిత్రులందరికీ,బిఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ,నాయకులందరికీ ఒక్కటే మనవి, మోసపూరిత మాటలు చెప్పి, వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని బంధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మోసపు మాటలు, మోసపు వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కు అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐ రెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి గంట రాములు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ యూత్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్,గోపరపల్లి సర్పంచ్,హరిపురం సర్పంచ్, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన