శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాల సేకరణ

శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాల సేకరణ

తెలకపల్లి, ; తెలకపల్లి, మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామంలో పాలెం వ్యవసాయ కళాశాల సహకారంతో రావెపి విద్యార్థులు, రైతులకు మట్టి నమూనాల సేకరణపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడితే పెట్టుబడి ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు సాధించవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వప్న, రోహిత్, నందిని, అఖిల, చారులత తదితరులు మాట్లాడుతూ పొలంలో గట్లు, చెట్ల నీడలు కాకుండా మధ్య భాగంలో జిగ్ బాగ్ పద్ధతిలో 10-12 చోట్ల 6-9 అంగుళాల లోతులో 'V' ఆకారంలో గుంతలు తీసి మట్టిని సేకరించాలని సూచించారు. సేకరించిన మట్టిని నీడలోనే ఆరబెట్టి రాళ్లు, వేర్లు తొలగించి, నాలుగు భాగాలుగా చేసి ఎదురెదురు భాగాలు తీసివేస్తూ చివరికి అరకిలో మట్టి మిగిలే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పర్వతాపురం గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన