గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు

సర్పంచ్‌ బట్ట అంజన బాబు కు ఘన సన్మానం

గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు

మధిర: గ్రామాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతూ హైదరాబాద్‌లోని TGIRDలో నిర్వహించిన VBGRAM శిక్షణ కార్యక్రమంలో ఖమ్మంపాడు గ్రామాభివృద్ధి మ్యాప్‌ను సమర్థవంతంగా ప్రదర్శించి పంచాయతీ రాజ్ కమిషనర్‌చే అభినందనలు పొందిన ఖమ్మంపాడు గ్రామ సర్పంచ్ బట్ట అంజన బాబు ను మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనాధని కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు తదితరులు బట్ట అంజన బాబు ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను మ్యాప్ రూపంలో గుర్తించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో అమలు చేసేందుకు VBGRAM కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఖమ్మంపాడు గ్రామ అభివృద్ధి ప్రణాళికను శిక్షణ కార్యక్రమంలో సమర్థవంతంగా వివరించి అధికారుల ప్రశంసలు అందుకోవడం అభినందనీయమన్నారు.ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో బట్ట అంజన బాబు ముందుకు సాగడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన