ఖమ్మం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి రెండు దశాబ్దాలుగా విశ్వసనీయ గళం.
మారాబత్తుల హరీష్ మాదిగ పాటిబండ్ల కిషోర్ మాదిగల ఉద్యమ ప్రస్థానానికి అభినందనలు...!
బోనకల్ : ఖమ్మం నగరాన్ని కేంద్రంగా చేసుకుని దాదాపు రెండు దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని భుజాలపై మోస్తూ మాదిగల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మారాబత్తుల హరీష్ మాదిగ పాటిబండ్ల కిషోర్ మాదిగలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు ఎర్రుపాలెం మండలానికి చెందిన మారాబత్తుల హరీష్ మాదిగ బోనకల్ మండలానికి చెందిన పాటిబండ్ల కిషోర్ మాదిగలు మందకృష్ణ మాదిగ నమ్మిన బంట్లుగా ఉద్యమంలో ముందుండి పనిచేస్తూ ఎన్నో ఉద్యమాలు కార్యక్రమాలు చేపట్టి మాదిగల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఉద్యమాన్ని వీడకుండా నిబద్ధతతో ముందుకు సాగుతూ మాదిగ రిజర్వేషన్ల సాధన కోసం తమ గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు విద్యా సాధన సంఘటనే శక్తి పోరాటమే మార్గం అనే నినాదంతో విద్యార్థులను చైతన్యపరుస్తూ మా హక్కు మా గౌరవం రిజర్వేషన్ సాధనే లక్ష్యం అనే ఆశయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎస్సీ వర్గీకరణ సాధన నేపథ్యంలో స్పందించిన హరీష్ మాదిగ కిషోర్ మాదిగలు తాము చేసిన సుదీర్ఘ పోరాటం వృథా కాలేదని గురుకుల ప్రవేశాల్లో ఉద్యోగ నియామకాల్లో తమకు రావాల్సిన వాటా దక్కడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఇది తమ పోరాటానికి దక్కిన ఫలితంగా భావిస్తున్నామని తెలిపారు రెండు దశాబ్దాలుగా ఖమ్మం నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఉద్యమానికి అంకితమై పనిచేస్తున్న ఈ ఇద్దరు ఉద్యమకారులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి బలమైన గొంతుకగా నిలిచారని పలువురు కొనియాడుతున్నారు మాదిగల హక్కుల కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ముందుండి పోరాడుతున్న మారాబత్తుల హరీష్ మాదిగ పాటిబండ్ల కిషోర్ మాదిగల సేవలు అభినందనీయమని మాదిగ బంధువులు పేర్కొంటున్నారు సమానత్వం స్వాభిమానం హక్కుల సాధన కోసం వారి పోరాట స్ఫూర్తి మరింత మందికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసిస్తున్నారు జై మాదిగ జై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటూ వారి ఉద్యమ ప్రస్థానానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


