జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలి.  

జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలి.  

గంభీరావుపేట  : రాజన్న సిరిసిల్ల జిల్లాశనివారం  వార్షిక తనిఖీల్లో భాగంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.ఈసందర్భంగా ఎస్పీ  పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు.అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు సీసీటీఎన్ఎస్ లో అందుబాటులో ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరంతరం సైబర్ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని  తెలిపారూ.దొంగతనం కేసుల ఛేదనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నేరస్తులను పట్టుకోవడంలో అవసరమైతే ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని కేసులను చేధించడంతో పాటు రికవరీ శాతం పెంచి బాధితులకు వారి సొత్తును తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.స్టేషన్ పరిధిలో గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని,డయల్–112కు ఫోన్ రాగానే పెట్రోలింగ్, బ్లూ కోల్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి వేగంగా చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.
 
 
Views: 120

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
నూతన తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,