కలెక్టర్ విద్యాశాఖ సమీక్షా సమావేశం
నాగర్‌కర్నూల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు.జిల్లా స్థాయి విద్యాశాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాఠశాల వయస్సు ఉన్న ప్రతి చిన్నారి పాఠశాలలో చేరేలా, నమోదైన విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి నమోదు పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు.ఎఫ్‌ఎల్‌ఎన్ ఫలితాలపై దృష్టి సారించి చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు చిన్న వయసులోనే అలవడేలా చూడాలని, డి-గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి సామర్థ్యానికి అనుగుణంగా బోధన చేయాలన్నారు. పీజీఐలో జిల్లాకు మెరుగైన స్థానం సాధించేలా హాజరు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు.భవితా కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లలను ఈ నెల 31లోగా గుర్తించి సదరం సర్టిఫికెట్లు, చేయూత పింఛన్ అందేలా చూడాలని, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన ఉపకార వేతనాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.వెనుకబడిన పాఠశాలలను గుర్తించి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో డీఈఓ ఏ. రమేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు పాల్గొన్నారు..jpg)
.jpg)
Views: 19
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
