భక్తి శ్రద్ధలతో మైసమ్మ బోనాల పండుగ

భక్తి శ్రద్ధలతో మైసమ్మ బోనాల పండుగ

  • కిక్కిరిసిన మైసమ్మ ఆలయ ప్రాంగణం
  • బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు

మందమర్రి, (మంచిర్యాల) : ఆషాడ మాసం ముగింపులో భాగంగా మండల కేంద్రంలోని బొక్కల గుట్ట హైవే గాంధారి మైసమ్మ ఆలయంలో బోనాల జాతర ఉత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమీపంలోని చెట్టు వద్ద నుంచి రెండు వందల బోనాలతో డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా బయలుదేరి మైసమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి - రాజా రమేష్, కౌన్సిలర్లు,వివిధ పార్టీలకు చెందిన నాయకులు మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్ నేతృత్వంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్ష రమేష్,ఆర్కేపీ ఎస్సై జాడి శ్రీధర్,సబ్ డివిజన్ పరిధిలోని సీఐ,ఎస్సై లు బందోబస్తు నిర్వహించి జాతరను విజయవంతం చేశారు. జాతర విజయవంతానికి కృషి చేసిన పోలీస్,ఫారెస్ట్,మున్సిపల్,మీడియా ప్రతినిధులకు ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, గౌరవ అధక్షుడు పారిపెళ్లి తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు.
 
1010912629
Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 
మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్‌
సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహధర్నా