హుస్నాబాద్‌లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్‌లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్


సిద్దిపేట : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్మితమవుతున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, పనుల నాణ్యత, వేగం, నిర్మాణ ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఈ సందర్బంగా ఆసుపత్రి నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి భవనం పూర్తయితే ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు మరింత చేరువ కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.నిర్మాణ పనుల సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి, ఆసుపత్రి భవన నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి,కౌన్సిలర్ కేశవేణి రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకట రమణ, యూత్ కాంగ్రెస్ నాయకుడు చెన్నవేణి విద్యాసాగర్ అధికారులు తదితరులు ఉన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

 ఆ వైపు వెళ్లాలంటే భయపడుతున్న ద్విచక్ర వాహనదారులు.  ఆ వైపు వెళ్లాలంటే భయపడుతున్న ద్విచక్ర వాహనదారులు.
బాన్సువాడ లో ఆ చౌరస్తా అంటే భయం. ద్విచక్ర వాహనాని కి చాలాన్ల మోత. ఆటోమెటిక్ సిగ్నల్ లను మున్సిపల్ పొలిమేరలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్న వాహన...
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా తోట లక్ష్మీకాంతారావు బాధ్యతల స్వీకరణ
చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు
మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎంపీ రావుల
​మల్యాలలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు
​మల్యాలలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు: మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు