ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, బూట్ల పంపిణీ
– విద్యాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి ,భూపాలపల్లి పట్టణ కేంద్రంలో శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, బూట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు విద్యార్థులకు స్వయంగా బ్యాగులు, పుస్తకాలు, బూట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించేందుకు బ్యాగులు, పుస్తకాలు, బూట్లు వంటి అవసరమైన వస్తువులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు.ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేసి ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ , వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు,విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 23
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
