గొడుగుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
దౌల్తాబాద్,సిద్దిపేట: గొడుగుపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ మద్దెల వనజస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లేశం,జీపీఓ దేవానంద్, వార్డు సభ్యులు దుర్గని నర్సింలు, మంత్రి కర్ణాకర్, పీఏసీఎస్ డైరెక్టర్ నల్ల ఆంజనేయులు,
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


