సీఎంఆర్‌ఎఫ్ పథకం నిరుపేదలకు వరం
రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డి పేట : ముఖ్యమంత్రి సహా య నిధి పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఉజుమా అంజుమ్ భర్త ఆమీర్ కు 30 వేల రూపాయల సీ ఎంఆర్‌ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భం గా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సంవత్సరానికి సుమారు రూ.1000 కోట్లకు పైన నిధులు మం జూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇది నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుందని అన్నారు. పార్టీలకతీతంగా సీఎంఆర్‌ఎఫ్ పథకం ఇవ్వడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు నిధులు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి అంజూమ్ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు, బండారి బాల్రెడ్డి ,గంట బుచ్చాగౌడ్, ద్యాగం లక్ష్మి నారాయణ , మిర్యాలకర్ చందు, పందిర్ల శ్రీనివాస్ గౌడ్ గంట వెంకటేష్ గౌడ్, బింగి మల్లేశం యాదవ్, తదితరులు పాల్గొన్నారు,
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 15:35:13
హన్మకొండ :అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు.మంగళవారం ఐనవోలు మండలానికి చెందిన...
