ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
ములుగు : శనివారం ములుగు జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ములుగు మండల మాజీ బిఆర్ఎస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.... కాంగ్రెస్ నాయకుల ఇసుక దందాను పక్కదారి పట్టించడానికి 39 సంవత్సరాల క్రితం చనిపోయిన తన తండ్రి గురించి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. తన తండ్రిని అప్పటి నక్సలైట్లలో భాగమైన సీతక్కే చంపారని ఆరోపించారు. "నా తండ్రి తో మాట్లాడి పంపిస్తాం అని చెప్పి శవాన్ని ఇంటికి పంపించారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతాన్ని సతీష్ రెడ్డి కి ఆపాదించడం దారుణమన్నారు. "చనిపోయింది నా తండ్రి అయితే మనసులో ఏమైనా ఉంటే నాకు ఉండాలి కానీ సతీష్ రెడ్డికి ఏమి సంబంధం" అని ప్రశ్నించారు. సీతక్క తనయుడు కుంజా సూర్య, తాను ఈరోజు కన్నతండ్రులను చిన్నప్పుడే కోల్పోవడానికి కారణం సీతక్కనే అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఇసుక దందాలు, భూ దందాలు, సెల్ ఫోన్ స్కామ్ లను సతీష్ రెడ్డి బయటపెడుతున్నాడనే అక్కసుతోనే, ఎప్పుడో 39 ఏళ్ల క్రితం జరిగిన తన కుటుంబ ఉదంతాన్ని సతీష్ రెడ్డికి ఆపాదించి, తన స్వలాభం కోసం ములుగు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ రెడ్డి విమర్శించారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
