పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
విద్యార్థుల భద్రతపై ఆందోళన.. తక్షణమే శుభ్రం చేయాలని డిమాండ్
చౌటకూర్, : చౌటకూర్ మండలం శివంపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలతో దట్టంగా అల్లుకుపోయింది. విద్యార్థుల సౌకర్యార్థం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన కళాశాల భవనాల చుట్టూ పెద్దఎత్తున పిచ్చిమొక్కలు పెరగడంతో ఆవరణంతా అపరిశుభ్రంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఆవరణలోని పొదలను తొలగించకపోవడంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. పొదలు దట్టంగా పెరగడంతో విషపురుగులు, పాములు, క్రిమికీటకాలు సంచరించే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.తరగతి గదులకు వెళ్లే సమయంలో, ప్రాంగణంలో తిరిగే సమయంలో భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని వాపోతున్నారు. కళాశాల పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాల్సి ఉండగా, అధికారుల పర్యవేక్షణ లోపంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణభద్రతను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కళాశాల ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
