బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు..
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు ఆధ్వర్యంలో అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం ఫలాలు అందించాలనే లక్ష్యంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,ఉప సర్పంచ్ గాలి రాజు, వార్డు సభ్యులు సరిత,దయ్యాల సునీత,మద్దూరి లావణ్య,మద్దూరి మమత,మల్లయ్య,మద్దూరి కుమారస్వామి, తెలుసూరి కుమారస్వామి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
