మల్యాలలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

మల్యాలలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

మల్యాల, : జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో శనివారం సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. మల్యాల మండల చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు దూడం రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.​ఈ సందర్భంగా చిరంజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం స్థానికులకు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, సమాజ సేవలో మరింత ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి, మల్యాల సింగిల్ విండో చైర్మన్ రాంలింగారెడ్డి, తాటిపెల్లి ఉపసర్పంచ్ లక్ష్మణచారి, ప్రముఖులు దూస వెంకన్న, తాళ్ల హరినాథ్, మురళి, మారుతి, మెడిశెట్టి శ్రీనివాస్, రాచర్ల బుమయ్య, కొక్కుల మహేష్, వేముల రవీందర్, కాటిపెల్లి శ్రీనివాస్, జితేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
నూతన తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,