వేములవాడలో అఖిలాండ శక్తి స్వరూపిణుల కొలువు ప్రజల అదృష్టం

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడలో అఖిలాండ శక్తి స్వరూపిణుల కొలువు ప్రజల అదృష్టం

వేములవాడ, :  ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీ ఉజ్జయిని మహంకాళి, శ్రీ ప్రత్యంగిరా, శ్రీ భగలాముఖి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆషాఢ మాసం ప్రజలందరికీ పవిత్రమైన మాసమని, బోనాల జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఒకే ఆలయంలో అఖిలాండ శక్తి స్వరూపిణులైన ముగ్గురు అమ్మవార్లు కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడం వేములవాడ ప్రజల అదృష్టమన్నారు. అమ్మవార్ల కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని, రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు. ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని ప్రభుత్వ విప్ అభినందించారు. ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనకు కమిటీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ తుమ్ మధు, కౌన్సిలర్లు తోట రాజు, కొండ శేఖర్, అన్నారం శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాగుల విష్ణు ప్రసాద్, పాత సత్యలక్ష్మి, బైరి సతీష్ ముదిరాజ్ తదితరులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కందుల క్రాంతి కుమార్, భివండి శ్రీనివాస్, నరేష్, మైలారం రాము తదితరులు పాల్గొన్నారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News