చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

నాగర్ కర్నూల్,  : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలు ఐలమ్మ అని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆమె ధైర్యం, ఆత్మగౌరవం, పట్టుదల నేటి తరానికి మార్గదర్శకమన్నారు. ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని, బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటయ్య, బీసీ సంక్షేమ సహాయ అధికారి శ్రీరాములు, అధికారులు, సిబ్బంది, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు