అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన్న యాదవ్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దొరల గడీలపై తిరుగుబాటు చేసి, పేదల హక్కుల కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Sep 2026 15:23:50
నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
