తాండూర్ యువతి యువకులు ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి.

తాండూరు పట్టణ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగరాజ్

తాండూర్ యువతి యువకులు ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి.



తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఎస్ ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకై ఉచిత కోచింగ్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని  తాండూరు పట్టణ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగరాజ్ ఒక ప్రకటనలో కోరారు.రిజిస్ట్రేషన్ ప్రక్రియ తాండూరు కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో  31-08-2026 వరకు కొనసాగుతుంది. నిరుద్యోగ యువతి, యువకుల సౌకర్యార్థం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉచిత కోచింగ్ తరగతులు నిర్వహించ బడుతున్నాయి కావున యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు యువతకు పట్టణ కాంగ్రేస్ అధ్యక్షులు బాతుల నాగరాజ్ విజ్ఞప్తి చేసారు, అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియకై ఎస్ ఐ, కానిస్టేబుల్ కై దరఖాస్తు చేసిన పత్రాలు, ఆధార్ కార్డు, ఇంటర్, డిగ్రీ మెమోల జిరాక్స్ లతో తాండూరు కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో యువతి యువకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేసారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News