వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి
మంగపేట: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి బోడ రామచంద్రం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నరు. నిజాం పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి మహిళా శక్తికి, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎడ్ల నరేష్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మురుకుట్ల నరేందర్, సీనియర్ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, కర్రీ నాగేంద్రబాబు,జంగం భాను, ఉపాధ్యక్షులు బూర్గుల సతీష్, అయ్యోరి యానయ్య, కోడం నాగేష్, దాసరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


