ఇస్నాపూర్‌లో మున్సిప‌ల్ ఆఫీస్ త‌లుపులు క్లోజ్‌.

మీడియాకు నో ఎంట్రీ.

ఇస్నాపూర్‌లో మున్సిప‌ల్ ఆఫీస్ త‌లుపులు క్లోజ్‌.

  • ర‌హ‌స్యంగా లోప‌ల ఏమి చేస్తున్నారు.
  • కౌన్సిల్ స‌మావేశానికి డోర్స్ క్లోజ్‌.
  • ఇస్నాపూర్‌లో నియంత పాల‌న సాగుతోందా.
  • కౌన్సిల‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు భ‌య‌ప‌డుతున్నారా.
  • లోప‌ల ఏమి జ‌రుగుతుందో ప్ర‌జ‌ల‌కు తెలియ‌కూడ‌దా.
  • ప్ర‌జాస్వామ్యంలో నియంత‌ల పెత్త‌నం!

ప‌టాన్ చెరు, :  ప‌టాన్ చెరు ప‌రిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అస‌లు ఏమి జ‌రుగుతోంది? ర‌హ‌స్య మీటింగ్‌ల వెనుక దాగి ఉన్న ర‌హ‌స్యం ఏమిటి? ప్ర‌జాస్వామ్యంలో ఇస్నాపూర్ నియంత‌ల చేతుల్లోకి వెళ్లిపోయిందా.... ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన విష‌యాల‌ ను ర‌హ‌స్యంగా ఎందుకు ఉంచుతున్నారు. అస‌లు ఇక్క‌డి అధికారులు ఏమి చేస్తున్నారు... అంతా మా ఇష్టం అంటూ పెత్త‌నం చేస్తున్న‌వీరిని ప్ర‌శ్నించే వారే లేరా... తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఇస్నాపూర్ నియంత‌ల పాల‌న‌లో ఉంద‌న్న సందేశాన్ని ప్ర‌జ‌ల‌కు బ‌లంగా వినిపిస్తోంది. నేడు ఇస్నాపూర్ మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశం జ‌రుగుతుంది. ఎప్ప‌టిలాగే మీడియా కూడా ఈ స‌మావేశానికి వెళ్లేందుకు మున్సిప‌ల్ ఆఫీస్‌కు చేరుకుంది. కానీ అక్క‌డి పాల‌కులు, అధికారులు త‌లుపులు మూసి వేసి కౌన్సిల్ మీటింగ్‌ను ర‌హ‌స్యంగా జ‌రిపించారు. మీడియాకు నో ఎంట్రీ ఇచ్చి, డోర్స్ క్లోజ్ చేసి అస‌లు వీరు లోప‌ల దేనిపై చ‌ర్చించుకుంటున్నారు అన్న‌ది అంద‌రి సందేహం.. ఇస్నాపూర్‌లో అవినీతికి ఇంకా ఎలా చేయాల‌ని చ‌ర్చించుకుంటున్న‌ట్లు ఉన్నారులే అని ప్ర‌జ‌ల మ‌ధ్య గుస‌గుస‌లు... ఏ త‌ప్పు లేక‌పోతే ఎందుకు కౌన్సిల్ మీటింగ్ డోర్స్ క్లోజ్ చేసి ర‌హ‌స్యంగా జ‌రుపుతున్నార‌ని మ‌రికొంద‌ని చ‌ర్చ‌. ఇస్నాపూర్‌లో అనేక స‌మ‌స్య‌లు, అనేక అవినీతి ఆరోప‌ణ‌లు.. ఈ అవినీతి ఆరోప‌ణ‌ల మ‌ర‌క‌లు అంటున్న అధికారుల‌ను ఈ స‌మావేశంలో కౌన్సిల‌ర్లు ప్ర‌శ్నింస్తార‌నే భ‌యంతో మీటింగ్‌కు మీడియాను అలౌ చేయ‌లేదా? మ‌రి కౌన్సిల్ మీటింగ్‌లో జ‌రిగే గంద‌ర‌గోళం బ‌య‌ట‌కు తెలియ‌కూడ‌ద‌ని, ప‌రువు పోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా... అందుకే త‌లుపులు మూసి మ‌రీ మీటింగ్ పెట్టుకున్నారా. ఇలా అనేక ప్ర‌శ్న‌లు అంద‌రిలో మొదులుతున్నాయి. నియంత‌ల్లా వ్య‌వ‌హ‌ రిస్తున్న ఇక్క‌డి పాల‌కులు ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన వారు అదే ప్ర‌జ‌ల‌కు త‌మ నిర్ణ‌యాలు తెలియ‌కుండా చేయ‌డం వెనుక ఉన్న మ‌త‌ల‌బుఏమిటి? అస‌లు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఏమి జ‌రుగుతుంది... కోట్ల స్కాం చేస్తున్నారా?  ప్ర‌జాధ‌నం దోచుకుంటున్నారా? స‌రికొత్త అవినీతి కార్య‌క్ర‌మాల‌కు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారా? జ‌రిగిన అవినీతి లెక్క‌లు వేసుకుని పంప‌కాలు చేసుకుంటున్నారా? ఎందుకు కౌన్సిల్ మీటింగ్ సమావేశం తలుపులు మూసి వేసి, మీడియాను బ‌య‌ట నిల‌బెట్టారు. మ‌రీ ఈ ర‌హ‌స్య మీటింగ్ వెనుక ఉన్న ర‌హ‌స్యాల‌ను ప్ర‌జ‌ల‌కు చెబుతారో లేక ఇంకా ఇస్నాపూర్ పాల‌కులు, అధికారులు ప్ర‌జ‌ల మ‌ధ్య భ్ర‌ష్టుప‌ట్టి, ఇదే నియంత పాల‌న సాగిస్తారో వెయిట్ అండ్ వాచ్

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు