కలెక్టరేట్ లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం

కలెక్టరేట్ లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం

నిర్మల్ జిల్లా : కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా అదనపు కలెక్టర్, అధికారులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఐలమ్మ పోరాటాలను గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను వివరించారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని లిఖించిందని తెలిపారు. వెట్టి చాకిరి నిర్మూలనకు పాటుపడిన గొప్ప మహిళ అని వివరించారు. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చాకలి ఐలమ్మ లాంటి వీర వనితల చరిత్రను నేటి తరం ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శంకర్, సిపిఓ గంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు