పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య, హాజరు, విద్యాబోధన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, విద్యార్థులందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాల అభివృద్ధికి గ్రామ సర్పంచ్ సహకారం తీసుకోవాలని సూచించారు.అనంతరం భూ రీ సర్వే పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, భూముల హద్దులు, ప్రభుత్వ, నిరుపయోగ, వ్యవసాయ, పట్టా భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, రెవెన్యూ రికార్డులతో భూ వివరాలను పూర్తిగా సరిపోల్చాలని, ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా రీ సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్ ఎం.డి. జమీల్, ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


