జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మంచిర్యాల్ కు రాక
మంచిర్యాల టౌన్ : జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ రేపు అనగా తేదీ 15-09-2026 మధ్యాహ్నం 12 గంటలకు మంచిర్యాల పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా, ఎస్టీ వర్గాల సమస్యలు, పోడు భూముల సమస్యలు మరియు వారి హక్కులు ఇతర అంశాలపై వినతిపత్రాలు సమర్పించాలనుకు నే వారి కి మధ్యాహ్నం 12 గంటలకు వారు మంచిర్యాలలో అందుబాటులో ఉంటారని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేష్ గౌడ్ తెలిపారు ఎస్టీ వర్గాలకు సంబంధించిన సమస్యలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది ఒక మంచి అవకాశమని సమస్యల పై వినతిపత్రాలు అందించాలనుకు నే ప్రతి ఒక్కరూ వెర హీరో షోరూమ్,జిల్లా కోర్ట్ పక్కన,మంచిర్యాలకు 12 గంటల సమయానికి చేరుకోవాలని వారు కోరారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


