దోసపహాడ్‌లో ఘనంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, (సూర్యాపేట): ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్ మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామంలో సోమవారం ఘనంగా జరిగాయి. పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు పిలుపు మేరకు, దోసపహాడ్ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ సేవా కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సద్దల నాగేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండేటి బిక్షం రెడ్డి, మల్లెపల్లి వెంకటేశ్వర్లు, మహిళా సంఘ అధ్యక్షురాలు కర్ణం సత్యవతి, 6వ వార్డు సభ్యురాలు వలపట్ల రాణి శంకర్, ముఖ్య నాయకులు సింగం వెంకన్న, కొండేటి రాంబాబు, గుంపుల వెంకన్న, గద్దల నాగయ్య, వలపట్ల శ్రీకాంత్, కనకయ్య, నాగయ్య, చంద్రయ్య, రమేష్, జాన్, షరీఫ్, కిరణ్, లచ్చయ్య, శంకర్, దొంగరి మదన్, గోగుల ప్రవీణ్, జానకి రాములు, లింగయ్య సహా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


