జోగిపేటలో మట్టి వినాయకుల పంపిణీ

జోగిపేటలో మట్టి వినాయకుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణ కోసం 11 ఏళ్లుగా కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మటం భిక్షపతి ఆధ్వర్యంలో

జోగిపేట  : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మటం భిక్షపతి ఆధ్వర్యంలో జోగిపేట పట్టణంలోని హనుమాన్ చౌరస్తా వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గత 11 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా మటం భిక్షపతి అందోల్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని ఆయన కోరారు. రసాయనిక పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు, పర్యావరణం కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని తెలిపారు.మట్టి వినాయకులను పూజించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించవచ్చని, భక్తితో గణనాథుని ఆరాధించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులపై మటం భిక్షపతి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. తెలంగాణకు పట్టిన గ్రహణం తొలగి, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Views: 35

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.