సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నాంపల్లి మండలంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 24మంది లబ్ధిదారులకు రూ. 8లక్షల, 22వేల చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.లబ్ధిదారులు తమకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


