నాంపల్లిలో భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు
నాంపల్లి గణనాధుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాంపల్లి పట్టణంలో గణేష్ కాలనీలో గణనాధునికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడికి అభిషేకం, అర్చనలు, పుష్పాలంకరణతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ పూజ కార్యక్రమంలో నాంపల్లి వెంకటనారాయణ వెంకటమ్మ దంపతులు, నాంపల్లి కేశవర్ధన్, జాల కృష్ణయ్య, బచ్చనబోయిన నాగరాజు, జాల ముత్తయ్య, పసుపులేటి యాదగిరి ,తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


