నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
మేడ్చల్ మల్లికాజిగిరి : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. పలు ప్రాంతాలలో జరగబోయే గణేశ్ ఉత్సవాల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వానించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

