గంభీరావుపేట్ పోలీసుల ఆధ్వర్యంలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం
– ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. :ఎస్సై సిహెచ్ శ్రీకాంత్
గంభీరావుపేట : గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని అక్రమంగా కలిగి ఉండి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం పట్టుకొని, వారి వద్ద నుండి సుమారు 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంభీరావుపేట్ మండలంలోని సముద్రలింగాపూర్ గ్రామ శివారులో నాగంపేట కామన్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా కలిగి ఉండి విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారంతో గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది,సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలను విచారించగా పెంట మనిశాంత్, మహేందర్, వయస్సు 19 సంవత్సరాలు, కులం: మున్నురుకాపు, ఇంటి నం.1-22, గర్జనపల్లి గ్రామం వీర్నపల్లి మండలం, ప్రస్తుతం గంభిరావుపేట మండలం లోని పొన్నల పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు తెలిపాడు, రెండోవ వ్యక్తిని విచారించగా బత్తిని సాయి కుమార్, తండ్రి-దేవయ్య, వయస్సు 28, కులం ముదిరాజ్, గ్రామం గోరంటల గుర్తించారు. వారి వద్ద ఉన్నకవర్‌ను పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకొని, ఎలక్ట్రానిక్ డిజిటల్ వెయింగ్ మెషిన్ ద్వారా తూకం వేయగా మొత్తం సుమారు 60 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని . అదేవిధంగా నిందితుల వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గంజాయి అక్రమ రవాణా, కలిగి ఉండటం మరియు విక్రయానికి సంబంధించిన ఎన్ డి పి ఎస్ చట్టం కింద తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గంభీరావుపేట ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ ప్రజలకు గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి పాల్పడే వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


